ఆ నివేదిక ప్రకారం 2024 జూన్ 4 నుంచి 30 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈసారి ప్రపంచకప్ అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇందుకోసం అమెరికాలో ఐదు వేదికలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అందులో ఫ్లోరిడా, న్యూయార్క్, డల్లాస్, మోరిస్ విల్లేలు ఉన్నట్లు సమాచారం. ఇక మరో ఐదు వేదికలు కరీబియన్ దీవుల్లో ఉండనున్నాయి. ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టి20 ప్రపంచకప్ ఉండనున్నట్లు సమచారం.
ఇక ఈసారి ప్రపంచకప్ లో 20 జట్లు పాల్గొంటున్నాయి. గత ఎడిషన్ లా క్వాలిఫయర్ రౌండ్ ఉండబోదు. 20 జట్లను.. నాలుగు జట్ల చొప్పున ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ లోనూ ఒక జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన 8 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో.. నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులగా విభజిస్తారు. ఇందులో ప్రతి జట్టు కూడా మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన 4 జట్లు సెమీస్ కు చేరతాయి. ఫైనల్ జూన్ 30న జరిగే అవకాశం ఉంది.