Virat Kohili: ఇది సార్ బ్రాండ్.. విండీస్ షాక్

ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 06:50 PM IST

ఈ రెండు సిరీస్‌ల్లోనూ పాలు పంచుకున్న సీనియర్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు కరీబియన్‌ దీవుల్లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్నప్పటికీ.. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి పొట్టి ఫార్మాట్‌ నుంచి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే కోహ్లీ.. ఎప్పట్లా ఈ సారి కమర్షియల్‌ ఫ్లయిట్‌లో కాకుండా.. తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో స్వదేశానికి వచ్చాడు. ఇటీవల వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌ అనంతరం తొలి వన్డేకు ముందు భారత ఆటగాళ్లు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.

విమానం లేట్‌ కావడంతో టీమిండియా దాదాపు 8 గంటలకు పైగా విమానాశ్రయంలోనే పడిగపులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై జట్టు సభ్యులతో పాటు మేనేజ్‌మెంట్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాత్రి పూట ప్రయాణాలు లేకుండా చూడాలని బీసీసీఐని కోరింది. అయితే పొట్టి సిరీస్‌లో పాల్గొనని కోహ్లీ.. ఇక నేరుగా ఆసియాకప్‌ బరిలో దిగనున్నాడు. ‘గ్లోబల్‌ ఎయిర్‌ చార్టర్‌ సర్విసెస్‌’ వారి ప్రత్యేక విమానంలో కోహ్లీ స్వదేశానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కోహ్లీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ఏసీఎస్‌ ఎయిర్‌ చార్టర్‌, కెప్టెన్‌ అబు పటేల్‌కు ధ్యాంక్స్‌’ అని పోస్ట్‌ చేశాడు.