ఆ ముగ్గురికీ కోల్ కతా గుడ్ బై తక్కువ ధరకే తీసుకునే ప్లాన్

ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రిటెన్షన్ రూల్స్ లో భారీ మార్పులు ఉండకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో కొందరు ఆటగాళ్ళను వేలంలోకి వదిలివేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇదే క్రమంలో తమ ఆటగాళ్ళను వదిలేసినా మళ్ళీ తక్కువ ధరకే దక్కించుకునే ప్రయత్నంలో పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - August 30, 2024 / 10:35 PM IST

ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రిటెన్షన్ రూల్స్ లో భారీ మార్పులు ఉండకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో కొందరు ఆటగాళ్ళను వేలంలోకి వదిలివేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇదే క్రమంలో తమ ఆటగాళ్ళను వదిలేసినా మళ్ళీ తక్కువ ధరకే దక్కించుకునే ప్రయత్నంలో పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి. దీనిలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలివేస్తుందని సమాచారం. ఆ జాబితాలో స్టార్ పేసర్ మిఛెల్ స్టార్క్ , హార్డ్ హిట్టర్ నితీశ్ రాణాతో పాటు ఫిల్ సాల్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి గత వేలంలో మిఛెల్ స్టార్క్ ను ఏకంగా 24.5 కోట్ల రూపాయలకు కోల్ కతా దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి ఇదే అత్యధిక ధర. అయితే గత సీజన్ లీగ్ స్టేజ్ లో
స్టార్క్ అంతగా రాణించకున్నా ఫైనల్లో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రికార్డు ధరకంటే కాస్త తక్కువగా మళ్ళీ స్టార్క్ ను తీసుకోవచ్చని కోల్ కతా భావిస్తోంది.

అలాగే నితీశ్ రాణాను కూడా రిలీజ్ చేసే అవకాశముంది. శ్రేయాస్ అయ్యర్ దూరమైన 2023 సీజన్ లో నితీశ్ రాణానే ఆ జట్టును నడిపించాడు. 8 కోట్లకు అతన్ని కొనుగోలు చేసిన కోల్ కతా మిడిల్ ఆర్డర్ లో హిట్టర్ గా సత్తా చాటిన సందర్భాలున్నాయి. అయితే రిటెన్షన్ రూల్స్ లో రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా నితీశ్ రాణాను తీసుకోవాలని కోల్ కతా భావిస్తోంది. 86 మ్యాచ్ లలో 2199 పరుగులు చేసిన రాణాను రైట్ టు మ్యాచ్ ద్వారా కాకున్నా వేలంలో మళ్ళీ కొనుగోలు చేసే అవకాశముంది. అలాగే ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను కూడా వేలంలోకి వదిలేసి మళ్ళీ దక్కించుకోవాలని కోల్ కతా భావిస్తోంది. 12 మ్యాచ్ లలో 435 పరుగులతో అదరగొట్టిన సాల్ట్ ను రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రిటెన్షన్ లో ఇద్దరి కంటే ఎక్కువ విదేశీ ప్లేయర్స్ కు అవకాశం ఉండదు. అందుకే వేలంలోకి వదిలేసి మళ్ళీ తక్కువ బిడ్డింగ్ తో కొనుగోలు చేసే ఛాన్సుంది.