ICC ODI World Cup 2023 : సెమీఫైనల్ లో ఉండేదెవరు.. సూర్య నా..? రవి నా..?

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌ లకు తొమ్మిది గెలిచిన భారత్.. అదే జోరును కివీస్‌పై కొనసాగించి గత ప్రపంచకప్‌ లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ భావిస్తోంది. రెండు పటిష్ట జట్ల మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ నేపథ్యంలో సెమిస్ కు సంబంధించి ఒక కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్పెలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. కివీస్ బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండడం ఓ కారణం అయితే.. వాంఖడే స్టేడియం పిచ్ స్పిన్‌ కు అనుకూలిస్తుందనే అంచనాలు మరో కారణం. అయితే అశ్విన్ జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ బలహీనం అవుతుంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.