WTC టైటిల్ గెలవడమే టార్గెట్ ముందుగానే ఐపీఎల్ క్లోజ్

టెస్ట్ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్నా ఇప్పటి వరకూ టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకోలేకపోయింది. రెండుసార్లు ఫైనల్ కు చేరినప్పటకీ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 04:02 PM IST

టెస్ట్ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్నా ఇప్పటి వరకూ టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకోలేకపోయింది. రెండుసార్లు ఫైనల్ కు చేరినప్పటకీ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు ఐపీఎల్ ఉండడమే ఈ ఓటములకు కారణమన్న విమర్శలూ ఉన్నాయి. గత రెండు సందర్భాల్లోనూ ఐపీఎల్ కూ, డబ్ల్యూటీసీ ఫైనల్ కు మధ్య వారం రోజుల సమయమే ఉండడంతో ఆటగాళ్ళు అలసిపోవడం ప్రభావం చూపిందన్నది కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు 15 రోజుల ముందుగానే ఐపీఎల్ ముగించేలా ప్లాన్ చేస్తోంది.

దీని ప్రకారం చూస్తే ఐపీఎల్ 18వ సీజన్ మార్చి నెలాఖరున ప్రారంభం కావడం ఖాయమైనట్టే. దాదాపు రెండు నెలల పాటు 80 మ్యాచ్ ల వరకూ ఐపీఎల్ షెడ్యూల్ ఉంటుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరిగే సమయానికి కనీసం రెండు వారాల ముందే ఐపీఎల్ ముగించేలా ప్లాన్ చేస్తున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. కాగా ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ చేరడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. ఇంకా 10 టెస్టులు ఆడాల్సి ఉంది. దీనిలో ఐదు మ్యాచ్ లు గెలిచినా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఈ సారి ఎలాగైనా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలన్న లక్ష్యంతోనే బీసీసీఐ ఐపీఎల్ ను ముందే ముగించబోతోంది.