Ashes Series: కప్పులు గెలిచిన ప్రతివాడు తోపు కాదు ఆట కంటే మాట ముఖ్యం బిగిలూ

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో రనౌటైన విధానం తీవ్ర వివాదస్పదం అవుతుంది. ఇదే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 03:16 PM IST

ఆస్ట్రేలియన్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని.. గెలుపు కోసం ఏదైనా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా టీమ్ పై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లతో పాటు భారత లెజండరీ క్రికెటర్‌లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఇంగ్లీష్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్‌ అం‍టూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను దారుణంగా ట్రోలింగ్ చేసింది.

‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్‌ చేసి ‘క్రైబేబీస్’ అనే ట్యాగ్ తో ఓ కథనాన్ని ప్రచురించింది. ఓ పసిబాలుడు నోటిలో పాలపీకాను పట్టుకుని.. మరో వైపు యాషెస్‌ ట్రోఫిని, బంతిని పడేసినట్లు ఉన్న ఫోటోను విడుదల చేసింది. ఆ పసిబాలుడు ముఖాన్ని బెన్ స్టోక్స్‌గా మార్ఫింగ్‌ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ పోస్టుపై ఇంగ్లండ్‌ టెస్ట్ సారథి బెన్‌ స్టోక్స్‌ రియాక్ట్ అయ్యాడు.

కచ్చితంగా అది నేను మాత్రం కాదు.. ఎందుకంటే నేనెప్పుడు కొత్త బాల్ తో బౌలింగ్ చేస్తాను.. అంటూ స్టోక్స్‌ కౌంటరిచ్చాడు. కాగా రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమి పాలైనప్పటికీ స్టోక్స్‌ మాత్రం అద్భుతమైన పోరాటం పటిమ కనబరిచాడు. జట్టును గెలిపించేందుకు ట్రై చేశాడు స్టోక్స్‌.. చివరిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఓవరాల్‌గా 214 బంతులు ఎదుర్కొన్న బెన్ స్టోక్స్‌ 155 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య యాషెస్‌ మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్‌ వేదికగా స్టార్ట్ కానుంది. సిరీస్‌ రేసులో నిలవాలంటే మూడో టెస్టులో ఇంగ్లండ్‌ టీమ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.