Ahmed Shehzad: మమ్మల్ని భయపెట్టే బౌలర్ లేడు.. షోయబ్ అక్తర్ ఒక్కడే లెజెండ్.. పాక్ క్రికెటర్ ప్రశ్నలకు సమాధానమేది?

గత 10 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతుంది. చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. నాకౌట్స్ లేదా ఫైనల్లో తడబడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమిపాలైంది.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 11:41 AM IST

Ahmed Shehzad: టీమిండియాలో స్టార్ బ్యాటర్లున్నా.. ప్రమాదకర బౌలర్ లేడని పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహ్‌జాద్ అన్నాడు. దాంతో టీమిండియా ఐసీసీ ఈవెంట్స్ గెలవలేకపోతోందని చెప్పాడు. గత 10 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతుంది.

చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. నాకౌట్స్ లేదా ఫైనల్లో తడబడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమిపాలైంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవ్వడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియాలో బౌలింగ్ సమస్య ఉందని అహ్మద్ షెహ‌జాద్ తెలిపాడు. భారత జట్టు పట్ల ఎలాంటి అగౌరవం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అశ్విన్‌లాంటి మంచి బౌలర్లు ఉన్నప్పటికీ.. ప్రత్యర్థిని భయపెట్టే ప్రమాదకర బౌలర్‌ జట్టులో లేడు. మరోవైపు బ్యాటర్లు మాత్రం ప్రమాదకరమే’ అని షెహజాద్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

ఇక తాను చూసిన డేంజరస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అని, అతన్ని నెట్స్‌లో ఎదుర్కోవడం ఎంతో కష్టమని తెలిపాడు. ఈ విషయంలో అక్తర్‌ కాకుండా తాను మరో బౌలర్‌ను గుర్తుచేసుకోలేనని చెప్పాడు. ఇక టీమిండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధమవుతోంది. తాజాగా టెస్టులకు, వన్డేలకు జట్టును బీసీసీఐ ప్రకటించింది.