Tilak Varma: వీళ్ళతో లాభం లేదు

తొలి టి20లో 4 పరుగుల తేడాతో ఓడిన భారత్.. రెండో టి20లో 2 వికెట్ల తేడాతో ఓడింది. సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే చివరి మూడు టి20ల్లోనూ భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 04:55 PM IST

టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు టి20 మ్యాచ్ ల్లోనూ ఒక్క ప్లేయర్ మినహా మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రెండు టి20ల్లోనూ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. రెండింటిలోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండు మ్యాచ్ ల్లోనూ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ.. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ లా బ్యాటింగ్ చేశాడు. అతడి బ్యాటింగ్ ను చూసిన వారికి అతడు రెండో టి20 మ్యాచ్ ఆడుతున్నాడంటే నమ్మబుద్ది కాదు. 100 మ్యాచ్ ల అనుభవం ఉన్న ప్లేయర్ లా బ్యాటింగ్ చేశాడు.

ఈ క్రమంలో తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్ కు ఎంపిక చేయాలనే డిమాండ్ పెరిగిపోయింది. నెంబర్ 4కు సరైనోడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, శ్రేయస్ అయ్యర్ కంటే కూడా తిలక్ వర్మ నెంబర్ 4కు సరిగ్గా సరిపోతాడని వారు అభిప్రాయ పడుతున్నారు. ఆసియా కప్ 2023తో పాటు ప్రపంచకప్ కు కూడా తిలక్ వర్మను ఎంపిక చేస్తే టీమిండియాకు అనుకూలం అంటూ వారు పేర్కొంటున్నారు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బిగ్ టోర్నీల్లో నెంబర్ 4లో భారీ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయర్ లేడంటూ అయితే తిలక్ వర్మ రూపంలో భారత్ కు ప్రత్యామ్నాయం దొరికిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.