ఐపీఎల్ మెగా వేలం ఢిల్లీ రిటైన్ ప్లేయర్స్ వీళ్ళే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. రిటెన్షన్ నిబంధనలపై ఇంకా క్లారిటీ రాకున్నప్పటకీ ఎవరి కొనసాగించాలనే దానిపై అన్ని ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

  • Written By:
  • Publish Date - August 20, 2024 / 05:22 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. రిటెన్షన్ నిబంధనలపై ఇంకా క్లారిటీ రాకున్నప్పటకీ ఎవరి కొనసాగించాలనే దానిపై అన్ని ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితాలో కెప్టెన్ రిషబ్ పంత్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఐపీఎల్ తోనే రీఎంట్రీ ఇచ్చిన పంత్ సారథిగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించాడు.
2024 సీజన్ లో పంత్ 13 ఇన్నింగ్స్ లలో 446 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ యువ వికెట్ కీపర్ జట్టును వీడతాడని వార్తలు వచ్చినా డీసీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఖండించాడు. ఈ నేపథ్యంలో పంత్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోవడం ఖాయం.

పంత్ తర్వాత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ గానే కాకుండా బ్యాట్ తోనూ అదరగొట్టే అక్షర్ పటేల్ 17వ సీజన్ లో 235 రన్స్ చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్ రోల్ లో మంచి ఛాయిస్ కావడంతో అక్షర్ కూడా కొనసాగడం ఖాయమైనట్టే. ఇక మరో స్రిన్నర్ కుల్దీప్ యాదవ్ ను కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ లో కుల్దీప్ బంతితో అద్భుతంగా రాణించి 16 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇద్దరు విదేశీ క్రికెటర్ల కోసం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నిస్తోంది. సఫారీ క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ , ఆస్ట్రేలియా హిట్టర్ ఫ్రేజర్ మెక్ గర్క్ లను రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా జట్టులోకి తిరిగి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.