గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ నియమించవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి మళ్లీ ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతాడన్న వార్తలు వస్తున్నాయి. పాండ్యా జట్టును వీడితే గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. గిల్ తో పాటుగా మరో నలుగురు ఆటగాళ్లు రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, పాట్ కమిన్స్ లిస్ట్ లో ఉన్నారు. కానీ ఫ్రాంచైజీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గిల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2015లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు హార్దిక్ పాండ్యా. ఏడేళ్ల పాటు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. 2022 వేలానికి ముందు ముంబయి అతడిని వదులుకోగా.. హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకున్న గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ కు తొలి సీజన్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా జట్టును విజేతగా నిలిపాడు. ఆ తరువాత జరిగిన ఎడిషన్ లో రన్నరప్ గా నిలిపాడు. ఒకవేళ పాండ్యా జట్టును వదిలి వెళ్లిపోతే గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని చెప్పాలి.