ఐపీఎల్ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. రిటెన్షన్ రూల్స్ కు సంబంధించి బీసీసీఐ నిర్ణయం నెలాఖరుకు రానుండగా…ఫ్రాంచైజీలు తమ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నాయి. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్ళను రిటైన్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగా గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితాను చూస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు మరో ముగ్గురి పేర్లు ఉండనున్నాయి. హార్థిక్ పాండ్యా ముంబైకి వెళ్ళిపోవడంతో పగ్గాలు అందుకున్న గిల్ కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ పరంగానూ అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే గుజరాత్ తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచినప్పుడు గిల్ అద్భుతంగా ఆడాడు.
గిల్ తర్వాత ఆల్ రౌండర్ సాయిసుదర్శన్ ను గుజరాత్ రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడుకు చెందిన సాయిసుదర్శన ఇప్పటి వరకూ బ్యాట్ తో రాణించాడు. 25 ఐపీఎల్ మ్యాచ్ లలో వెయ్యికి పైగా పరుగులు చేశాడు. అలాగే సీనియర్ పేసర్ మహ్మద్ షమీని కూడా గుజరాత్ రిటైన్ చేసుకోనుంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో షమీ దుమ్మురేపాడు. అంతకుముందు రెండు ఐపీఎల్ సీజన్లలోనూ షమీ గుజరాత్ కు కీలకంగా మారాడు. ఇక స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా గుజరాత్ కొనసాగించడం ఖాయం. మొన్నటి వరకూ రషీద్ ఖాన్ బంతితోనే మ్యాజిక్ చేస్తుండగా… ఇప్పుడు బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ నలుగురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకోనుండగా.. రైట్ టూ మ్యాచ్ ద్వారా గుజరాత్ ఎవరిని దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
onships.