Tilak Varma: బ్యాటింగ్‌లో యువరాజ్.. బౌలింగ్‌లో రైనా..

ఈ టీ20 సిరీస్‌లో టీమ్‌ ఇండియాకు తిలక్ వర్మ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్‌ లభించడం విశేషం. భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన తిలక్.. తొలి సిరీస్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరీస్ మొత్తంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైనా.. అరంగేట్రం అవకాశం దక్కించుకున్న తిలక్.. జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 03:56 PM IST

Tilak Varma: తిలక్ వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడమే కాకుండా బౌలింగ్‌లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఐదో టీ20 మ్యాచ్‌లో తొలిసారి బౌలింగ్ చేసిన తిలక్ వర్మ.. తాను వేసిన తొలి ఓవర్ రెండో బంతికే కీలక వికెట్ పడగొట్టాడు. దీంతో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటుతూ.. తొలి సిరీస్‌లోనే స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు.

ఇక, వెస్టిండీస్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా ఓటమితో ముగించింది. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్‌కు టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితం దక్కలేదు. భవిష్యత్‌లో టీ20 జట్టును నిర్మించేందుకు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ సేనను రంగంలోకి దించిన సెలక్షన్ బోర్డుకు సిరీస్ ఓటమి షాక్ ఇచ్చింది. ఈ టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టీ20 టోర్నీలో టీమిండియా తరపున కొందరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. వీరిలో కొందరు సెలక్షన్ బోర్డు నమ్మకాన్ని నిలబెట్టుకోగా, మరికొందరు మళ్లీ విఫలమయ్యారు. అయితే ఈ టీ20 సిరీస్‌లో టీమ్‌ ఇండియాకు తిలక్ వర్మ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్‌ లభించడం విశేషం. భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన తిలక్.. తొలి సిరీస్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.

సిరీస్ మొత్తంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైనా.. అరంగేట్రం అవకాశం దక్కించుకున్న తిలక్.. జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ రెండో బంతికి సిక్సర్ కొట్టి కెరీర్ ప్రారంభించిన తిలక్.. ఈ టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తిలక్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ సహా 173 పరుగులు చేశాడు.