Tilak Varma: వెస్టిండీస్ టూర్‌లో యువ ఆటగాళ్లకు టీమ్ ఇండియాలో వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. టెస్టు, వన్డే సిరీస్‌ల తర్వాత టీ20 సిరీస్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. తొలి వన్డేలోనే యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు అవకాశం కల్పించారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో తన ప్రదర్శనతో ప్రభావం చూపిన తిలక్ వర్మను టీమిండియా మొదటిసారి స్క్వాడ్‌లో చేర్చి, తొలి మ్యాచ్‌లోనే అవకాశం అందించింది.
అయితే బ్యాటింగ్ చేయడానికి ముందు తిలక్ వర్మ తన బలమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లో ప్రభావం చూపాడు. ఇది వెస్టిండీస్ భారీ స్కోరు చేయకుండా నిరోధించడంలో సహాయపడింది. ఇది మాత్రమే కాదు, ఈ క్రమంలో సురేష్ రైనా ప్రత్యేక రికార్డును కూడా తిలక్ సమం చేయడం విశేషం. జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ క్యాచ్‌లు అందుకున్న వర్మ.. సురేష్ రైనా రికార్డును సమం చేశాడు. రైనాలాగే తిలక్ కూడా టీ20 అరంగేట్రంలో రెండు క్యాచ్‌లు పట్టడంలో సఫలమయ్యాడు.