ఐపీఎల్ 2024 సీజన్‌లో.. ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. వరుస ఓటములతో హార్థిక్ సేన పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో పాయిట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల కోసం బెంగళూరు, ముంబై మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ సీజన్‌ను.. ముంబై ఇండియన్స్ వివాదాలతోనే స్టార్ట్ చేసింది. గుజరాత్ నుంచి హార్ధిక్‌ను తీసుకొని.. రోహిత్‌ను పక్కనపెట్టి మరీ.. హార్ధిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం.. కొత్త చర్చకు కారణం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు.. ముంబై ప్రదర్శన చూస్తే జాలేస్తోంది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ! ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడితే.. కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. లాస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీని ఢీకొట్టింది ముంబై ఇండియన్స్. ఢిల్లీ బ్యాటర్లు.. ముంబైని ఓ ఆట ఆడుకున్నారు. ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ బ్రేక్ అవుతుందా అనే డౌట్ వచ్చింది ఓ టైమ్‌లో. చివరికి 257 పరుగుల దగ్గర ఆగిపోయింది.
ఐతే ముంబై కూడా మంచి ఫైటే ఇచ్చింది. చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ముంబై పోరాటంలో.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కీ రోల్ ప్లే చేశాడు. 32 బాల్స్‌లో 63 రన్స్ చేసి.. హై స్కోరర్‌గా నిలిచాడు. బ్యాటర్లు అంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. చివరి వరకు ముంబై తరఫున ఆశలు సజీవంగా ఉంచాడు. ఐతే తిలక్ వర్మ మీద కెప్టెన్ హార్ధిక్ వర్మ చేసిన కామెంట్లు.. తెలుగు అభిమానులకు మంట పుట్టిస్తున్నాయ్. ఢిల్లీ మీద ఓటమికి తిలక్ వర్మే కారణం అంటూ పోస్ట్ మ్యాచ్‌లో.. హార్ధిక్ చేసిన కామెంట్లపై ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. 8 ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో.. మొదటి నాలుగు బంతులను తిలక్ వర్మ సింగిల్స్ తీశాడని.. అక్కడే మ్యాచ్ పోయిందంటూ హార్ధిక్ చేసిన కామెంట్లపై.. ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
బౌలింగ్ సరిగా లేదు.. ఫీల్డింగ్ సెట్ కాలేదు. అన్నీ వదిలేసి.. ఒంటరి పోరుచేసిన తిలక్ వర్మ మీదకు కారణం నెడతావా హార్ధిక్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తెలుగు ఆటగాడు, తెలుగోడు అంటే అంత చిన్న చూపా అని అంటున్నారు. ఈ సీజన్‌లో తిలక్ వర్మ.. చాలా కష్టపడ్డాడు. 3 హాఫ్ సెంచరీలు చేశాడు ఇప్పటివరకు. ఐతే జట్టు ప్రదర్శన మాత్రం సోసోగా ఉంది. ఐనా సరే తిలక్ వర్మనే టార్గెట్ చేసి హార్ధిక్ మాట్లాడడం.. అతనిలో