Shaheen Afridi: మ్యాచ్ మొదటి ఓవర్ నాలుగు బంతులు నాలుగు వికెట్లు

టీ 20 క్రికెట్ లో సంచలనం నమోదయింది. వికెట్ కష్టంగా భావించే మొదటి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు వార్విక్ షైర్ బౌలర్. నిన్న విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - July 1, 2023 / 03:42 PM IST

సాధారణంగా మొదటి ఓవర్ లో ఏ బ్యాటర్ అయినా రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. మొదట పిచ్ ని అర్ధం చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాలి అనే రీతిలో ఉంటారు. బౌలర్ ఒక స్టన్నింగ్ డెలివరీ వేసినప్పుడు తప్పితే దాదాపుగా తొలి ఓవర్లో వికెట్ పడడం అసాధ్యం. ఇక వికెట్ పడితే తర్వాత తర్వాత వచ్చే బ్యాటర్ చాలా జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ వేసిన తొలి ఓవర్లోనే చరిత్ర సృష్టించాడు పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి ఎవ్వరు సాధించని ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పాడు.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది ప్రపంచ క్రికెట్ లో ఎంత డేంజరస్ బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్రిదికి ఒక స్పెషాలిటీ ఉంది. తొలి ఓవర్ లోనే వికెట్లు తీసి ప్రత్యర్థిని కష్టాల్లోకి నెడతాడు. 2021 టీ 20 ప్రపంచ కప్ లో తొలి ఓవర్లోనే రోహిత్, రాహుల్ ని లాంటి టాప్ బ్యాటర్లు సైతం ఆఫ్రిదిని ఎదుర్కోలేక పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అంతే కాదు ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆఫ్రిది బౌలింగ్ వేస్తున్నాడంటే హడలెత్తిపోతారు. నిన్న జరిగిన విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో ఈ సారి మొదటి ఓవర్లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 4 వికెట్లు తీసాడు.

ప్రస్తుతం షాహీన్ ఆఫ్రిది ఇంగ్లాండ్ లోని విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో వాంరిక్ షైర్ తరపున ఆడుతున్నాడు. నాటింగ్ హామ్ తో జరిగిన నిన్న మ్యాచులో తొలి రెండు బంతులకి అలెక్స్ డేవీని య్లబీడబ్ల్యూ రూపంలో, ఆ తర్వాత బెంజమిన్ ని క్లీన్ బౌల్డ్ చేసాడు. ఇక మూడు నాలుగు బంతులకి సింగిల్స్ రాగ 5 వ బంతికి మౌస్లేయ్(1) ఓలీ స్టోన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి బంతికి బర్నాడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఒక్క ఓవర్లో మూడు లేదా నాలుగు పడడం అప్పుడప్పుడు మనం చూసినా, ఇలా మొదటి ఓవర్లోనే ఒక బౌలర్ నాలుగు వికెట్లు తీయడం టీ 20 ల్లో ఇదే తొలిసారి.