U19 world cup: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో రసవత్తర పోరు చూడబోతున్నాం. టైటిల్ ఫేవరెట్ టీమిండియా, టాప్ టీమ్ ఆస్ట్రేలియా టైటిల్ కోసం తలపడబోతున్నాయి. రెండవ సెమీస్‌లో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. ఉత్కంఠ భరితంగా సాగిన లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మరో 5 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విజయ తీరానికి చేరుకుంది.
IVPL 2024: వచ్చేస్తోంది వెటరన్ ప్రీమియర్ లీగ్.. తెలంగాణ టీమ్ కెప్టెన్‌గా క్రిస్ గేల్
తక్కువ స్కోర్ అయినప్పటికీ పాక్ యువ బౌలర్లు చివరి వరకూ పోరాడారు. అయితే ఆసీస్ లోయర్ ఆర్డర్ పట్టుదలగా నిలిచి విజయాన్ని అందించారు. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బలమైన టీమిండియాతో తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా, సెమీస్‌లో కాస్త టెన్షన్ పడినా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించింది.
భారత యువశక్తి ఎంత పటిష్టంగా ఉందో ఈ మ్యాచ్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఆస్ట్రేలియా కూడా లీగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ రికార్డు స్థాయిలో 9వ సారి ఫైనల్స్‌కు చేరుకోగా, ఆస్ట్రేలియ 6వ సారి ఫైనల్‌కు దూసుకొచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు.