Uday Saharan: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు పంజాబ్ యువ బ్యాటర్ ఉదయ్ సహారన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక మాజీ వికెట్ కీపర్ తిలక్ నాయుడు నేతృత్వంలోని భారత జూనియర్ సెలక్షన్ ప్యానెల్ ఈ జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ లకు స్థానం దక్కింది. అవనీశ్ రావు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కాగా, మురుగన్ అభిషేక్ బౌలర్. అనంతరం, జనవరి 19 నుంచి అండర్-19 వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ కప్‌కు ముందు డిసెంబర్ 29 నుంచి జనవరి 10 వరకు ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో భారత యువ జట్టు ట్రై సిరీస్ ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇదే జట్టును కొనసాగించారు.
భారత జట్టు ఇదే..
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), ఆరవెల్లి అవనీశ్ రావు (వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, సచిన్ దాస్, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, ప్రియాన్షు మొలియా, మురుగన్ అభిషేక్, ఇన్నేశ్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ముషీర్ ఖాన్, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ.
ట్రయాంగిల్ సిరీస్‌కు స్టాండ్ బై ఆటగాళ్లు
ప్రేమ్ దేవ్ కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్
బ్యాకప్ ప్లేయర్లు..
దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేశ్, కిరణ్ చార్మోలే