అన్ క్యాప్డ్ కేటగిరీ రూల్ పాత జట్లతోనే ఆ ప్లేయర్స్

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివర్లో జరగబోతోంది. వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది. అయితే మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన అన్ క్యాప్డ్ ప్లేయర్ నిబంధన కారణంగా ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన పలువురు ఆటగాళ్ళను తక్కువ బిడ్లకే సొంతం చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - September 29, 2024 / 06:19 PM IST

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివర్లో జరగబోతోంది. వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది. అయితే మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన అన్ క్యాప్డ్ ప్లేయర్ నిబంధన కారణంగా ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన పలువురు ఆటగాళ్ళను తక్కువ బిడ్లకే సొంతం చేసుకోవచ్చు. మొన్నటి వరకూ 12 కోట్లు చెల్లించిన ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు 4 కోట్లకే దక్కించుకోనుంది. అలాగే పలువురు ప్లేయర్స్ తమ పాత జట్లతోనే కొనసాగనున్నారు. ఈ అన్ క్యాప్డ్ రూల్ కారణంగా ధోనీతో పాటు మరో నలుగురు ఐపీఎల్ ప్లేయర్స్ కూడా లాభపడొచ్చు.. ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న పియూష్ చావ్లా, చివరిగా 2012లో టీమిండియాకి ఆడాడు. అతన్ని ముంబై రిటైన్ చేసుకోవాలని అనుకుంటే Uncapped రూల్ కింద తీసుకోవచ్చు.

అలాగే ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన మోహిత్ శర్మ, చివరిగా 2015లో భారత జట్టుకు ఆడాడు. అతన్ని తమతో పాటే కొనసాగించుకోవాలని గుజరాత్ అనుకుంటే అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవచ్చు. ఇక 2015లో టీమిండియాకి ఆడిన సందీప్ శర్మ గత వేలంలో అమ్ముడులేదు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ గాయపడడంతో అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ టీమ్‌లోకి వచ్చి అదరగొట్టాడు. అతన్ని రిటైన్ చేసుకోవాలంటే పంజాబ్ అన్ క్యాప్డ్ ప్లేయర్‌ రూల్‌ని వాడుకోవచ్చు. కాగా టీమిండియా తరుపున 22 టెస్టులు, 36 వన్డేలు, 8 టీ20లు ఆడిన అమిత్ మిశ్రా, 2017లో చివరిగా భారత్‌‌కి ప్రాతినిధ్యం వహించాడు. గత 3 సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కి ఆడుతున్న అమిత్ మిశ్రాని రిటైన్ చేసుకోవాలని అనుకుంటే అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు.​