UPPAL MATCH TICKETS: ఉప్పల్ మ్యాచ్‌కు టిక్కెట్లేవి.. ఆన్‌లైన్‌‌లో నిమిషంలోనే సోల్డవుట్.. లెక్క చెప్పని ఎస్సారెచ్..

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఉంచినట్లే ఉంచి.. బ్లాకులో అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ నెల 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్‌తో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడబోతుంది. ఈ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 03:43 PM IST

UPPAL MATCH TICKETS: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు చూద్దామని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు పేటీఎంలో నిమిషంలోనే సోల్డవుట్ అయిపోతున్నాయి. దీంతో మ్యాచ్ నిర్వాహకులపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా..? ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఉంచినట్లే ఉంచి.. బ్లాకులో అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ నెల 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్‌తో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడబోతుంది.

Kadiyam Srihari Vs Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా రాజయ్య.. కడియం మీద ప్రతీకారం తీర్చుకుంటారా..?

ఈ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచుల టిక్కెట్లు పేటీఎంలో అందుబాటులో ఉంచారు. అయితే పేటీఎంలో ఉంచిన నిమిషంలోపే టిక్కెట్లన్నీ సోల్డవుట్ అని చూపిస్తోంది. టిక్కెట్ బుక్ చేసుకుని, పేమెంట్ చేసేలోపే టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోతుండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తన్నారు. నిమిషంలోపే వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నిస్తున్నారు. అసలు పేటీఎంలో ఎన్ని టిక్కెట్స్ అందుబాటులో ఉంచుతున్నారో.. ఎన్ని ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నారు.. ఎన్ని స్పాన్సర్స్‌కు అందిస్తున్నారు వంటి వివరాలేవీ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చెప్పడం లేదు. టిక్కెట్ల లెక్కలు ఎస్‌ఆర్‌హెచ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పాలని క్రికెట్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. గత మ్యాచుల సందర్భంగా కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైనట్లు చూపించింది.

కానీ, బ్లాక్‌లో మాత్రం అధిక ధరకు టిక్కెట్లు విచ్చలవిడిగా అమ్మారు. రాబోయే మ్యాచులకు కూడా ఇదే పరిస్థితి తలెత్తనుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు దొరక్కపోడంతో చాలా మంది బ్లాక్‌లో కొనుక్కుని మ్యాచ్ చూడాల్సిన పరిస్థితి ఉంది. మ్యాచు కోసం రోజులతరబడి ఎదురుచూసిన ఫ్యాన్స్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు టిక్కెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మరి దీనిపై ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ ఎలా స్పందిస్తాయో చూడాలి.