Team India : టీమిండియాపై వాన్ అక్కసు.. నోరు మూసుకోమంటున్న ఫాన్స్

టీ20 (T20) వరల్డ్‌ కప్‌ (World Cup) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీ విజేతపై మాజీ ప్లేయర్స్ తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

 

 

టీ20 (T20) వరల్డ్‌ కప్‌ (World Cup) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీ విజేతపై మాజీ ప్లేయర్స్ తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎప్పటి లాగే భారత్ జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అక్కసు వెళ్లగక్కాడు. ఇంగ్లండ్‌ (England), ఆస్ట్రేలియా (Australia), సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఈసారి సెమీఫైనల్స్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్‌ ఫోర్‌కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వాన్‌ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. వాన్‌కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్‌కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు.

వరల్డ్‌ కప్‌ (World Cup) లో పాల్గొనే టీమిండియా (Team India) అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్‌కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్‌కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. వాస్తవానికి ఈసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనలిస్ట్‌లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్‌కప్‌లో టఫ్‌ ఫైట్‌ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి.