Virat Kohli: ఫిట్‌నెస్‌కు మారుపేరు విరాట్ కోహ్లీ. ఈ పరుగుల యంత్రం డైట్‌లో భాగంగా గతంలో వెజిటేరియన్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. అతడు ‘మాక్ చికెన్ టిక్కా’ తింటున్న ఫొటోను తాజాగా షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విరాట్ ఏంటీ.. ఇలా చేశాడని పలువురు కామెంట్లు కూడా పెట్టారు. అయితే..‘మాక్ చికెన్ టిక్కా’ను అభిమానులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం.
Shubman Gill: శుబ్‌మన్ గిల్‌పై ఫ్యాన్స్ ఫైర్
విరాట్ కోహ్లీ చాలా రోజుల కిందట శాకాహారిగా మారిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సంబంధ సమస్యల కారణంగా నాన్‌వెజ్ నుంచి వెజిటేరియన్‌గా మారాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో కోహ్లీ చెప్పాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేస్తూ ‘‘ఈ మాక్ చికెన్ టిక్కాను తప్పక ఇష్టపడతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా తమ కామెంట్లకు పని చెప్పారు. ‘‘అదేంటి విరాట్ వెజిటేరియన్ అని అన్నట్లు గుర్తు.. ఇప్పుడు ఇలా చికెన్ తింటున్నాడు ఏంటి?’’ అని కామెంట్లు పెట్టారు. అయితే, ఓ అభిమాని మాత్రం దీనికి చక్కటి సమాధానం ఇచ్చాడు.
‘‘కొంతమందికి ‘చికెన్ టిక్కా’కు ‘మాక్ చికెన్ టిక్కా’కు తేడా తెలియదు. ఇది పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్. ఒక రకమైన ప్లాంట్ నుంచి తయారు చేసిన ఆహారం. ఆ అర్థం తెలియక కోహ్లీ నాన్‌వెజ్ తిన్నాడంటూ వివాదాస్పదం చేయడం ప్రారంభించారు’’ అని తెలిపాడు.