Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. కొత్త ఏడాదిలో దుమ్ము రేపెందుకు రెడీ అయ్యాడు. 2023లో సూపర్ ఫామ్‌తో చెలరేగిన కోహ్లీ కోసం 2024లో పలు రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అంతకుముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న విరాట్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చింది. వన్డేల్లో అత్యధిక సెంచరీల సచిన్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్‌లోనూ 765 పరుగులతో విరాట్ ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.
David Warner: రిటైర్మెంట్.. అంతలోనే కెప్టెన్సీ.. వార్నర్‌కు సారథ్య బాధ్యతలు
ఇక ఏడు భిన్నమైన క్యాలెండర్ సంవత్సరాల్లో 2000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలో కోహ్లిని మరికొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. వీటిలో సచిన్ రికార్డులు కొన్ని బ్రేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2024లో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్‌ను బట్టి చూస్తే కోహ్లి ఏడు రికార్డులకు అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో 14వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కోహ్లి 152 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మార్క్‌ను వేగంగా అందుకున్న ప్లేయర్‌గా కోహ్లి చరిత్రలో నిలవనున్నాడు. సచిన్ ఈ ఘనతను 350 మ్యాచ్‌ల్లో అందుకోగా.. ఇప్పటివరకు 292 వన్డేలు ఆడిన కోహ్లి 13848 పరుగులు చేశాడు. లంకతో సిరీస్‌కు కోహ్లిని ఎంపిక చేస్తే ఈ రికార్డు బద్దలైనట్లే. అలాగే కోహ్లి మరో 35 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.
ఈ ఏడాది అఫ్గానిస్థాన్‌తో టీ ట్వంటీ సిరీస్, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ రికార్డు నమోదవ్వడం ఖాయం. ఇక స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించడానికి కోహ్లి చేరువలో ఉన్నాడు. మరో అయిదు శతకాలు సాధిస్తే ఈ రికార్డు కోహ్లీ ఖాతాలో చేరుతుంది. న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా, వెస్టిండీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ప్లేయర్‌గానూ రికార్డు నెలకొల్పడానికి కూడా విరాట్ చేరువలో ఉన్నాడు.