VIRAT KOHLI: అకాయ్ అంటే అర్థం తెలుసా!

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ నెల 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్‌ సోషల్ మీడియాలో ప్రకటించారు. తమ బాబుకు అకాయ్‌ అని పేరు పెట్టామని చెప్పారు.

  • Written By:
  • Updated On - February 21, 2024 / 01:29 PM IST

VIRAT KOHLI: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి రెండోసారి తండ్రి అయ్యాడు. విరాట్‌ భార్య అనుష్క శర్మ ఈనెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు అకాయ్‌ అని పేరు పెట్టామంటూ విరుష్క దంపతులు సోషల్ మీడియాలో ప్రకటించారు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ నెల 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్‌ సోషల్ మీడియాలో ప్రకటించారు.

MALLAREDDY: మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ ! ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వాలని కండిషన్

తమ బాబుకు అకాయ్‌ అని పేరు పెట్టామని చెప్పారు. అకాయ్ అంటే టర్కీష్‌లో ప్రకాశించే చంద్రుడని అర్థం. తల్లిదండ్రుల పేర్లు వచ్చేలా ఇప్పటికే మొదటి కూతురుకు వామిక అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. ఇప్పుడు అకాయ్ అనే పేరులోనూ తల్లిదండ్రుల పేర్లు ధ్వనిస్తున్నాయి. జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నామని, మా గోప్యతను గౌరవించండని విరాట్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కోహ్లీనే కాదు, ఆయన పోస్టులు కూడా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. కొడుకు పుట్టినట్లుగా ఇన్‌స్టాలో పెట్టిన గంటలోనే ఐదు మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఆసియాలోనే అత్యంత వేగంగా లైక్స్ అందుకున్న పోస్టుగా రికార్డులకెక్కింది. అంటే అకాయ్ పుడుతూనే రికార్డ్ సృష్టించాడు. అటు కోహ్లీ ఫ్యాన్స్ కూడా తండ్రిని మించినవాడు అవ్వాలంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం పాటు ఆట నుంచి విరామం తీసుకోవడంతో.. అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని ప్రచారం జరిగింది. ఇక విరాట్ తండ్రి కాబోతున్నాడని కొంతకాలంగా సోషల్‌మీడియా కోడై కూసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా, కోహ్లి సహచరుడు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ వార్తలను నిజం చేస్తూ కోహ్లీ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.