VIRAT KOHLI: అందుకే కోహ్లీని కింగ్ అనేది.. విరాట్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా

కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీ చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు.

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 04:20 PM IST

VIRAT KOHLI: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో హుందాగా వ్యవహించే ఆటగాళ్లు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మైదానంలో దూకుడుగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించడంలో కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు. ఈ విషయం మరోసారి రుజువైంది. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీ చేసిన పని అందరినీ ఆకట్టుకుంది.

YS JAGAN: కేసీఆర్‌తో జగన్‌ రహస్య చర్చలు.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు..?

తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు చివరిసారిగా ఎల్గర్‌ మైదానంలో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన ఎల్గర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 12 పరుగులే చేశాడు. ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించగా.. అది ఎడ్జ్‌ తీసుకుని ఫస్ట్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. అక్కడ వున్న విరాట్‌ కోహ్లి ఈజీగా ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన వెంటనే కోహ్లి ఎటువంటి సెలబ్రేషన్స్‌ జరపుకోకుండా పరిగెత్తుకుంటూ ఎల్గర్‌ వద్దకు వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని డ్రెస్సింగ్ రూమ్‌తో ప్రేక్షకులకు సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

గతంలోనూ పలు సందర్భాల్లో కోహ్లీ హుందాగా వ్యవహరించిన తీరును ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు నోరు పారేసుకున్నా కొన్నిసార్లు కోహ్లీ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ముఖ్యంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం ముగిసిన తర్వాత ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను మైదానంలో ప్రేక్షకులు టీజ్ చేశారు. మోసగాడు.. మోసగాడు అంటూ వెక్కిరిస్తూ హంగామా చేశారు. అప్పుడు జోక్యం చేసుకున్న విరాట్ ప్రేక్షకులను మందలించాడు. బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ దగ్గరకు వెళ్లి ప్రేక్షకులకు చూపిస్తూ క్లాప్స్ కొట్టాలని గట్టిగానే చెప్పాడు. అప్పుడు కూడా చాలా మంది మాజీలు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.