Virat Kohli: విరాట్ ఉండగా రికార్డుల కోసం ప్రయత్నాలు దండగ..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఒక్కో రికార్డులను పరిశీలిస్తే, అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ విరాట్ ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 01:48 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఒక్కో రికార్డులను పరిశీలిస్తే, అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ విరాట్ ఉన్నాడు. విరాట్ చివరిదైన నాలుగో టెస్టులో 364 బంతులు ఎదుర్కొని, 186 పరుగులను చేసాడు. అదే మ్యాచ్ లో ఉస్మాన్ ఖవాజా 422 బంతులు ఆడి 180 పరుగులతో ఔటయ్యాడు. శుబ్ మాన్ గిల్ 235 బంతుల్లో 128 రన్స్ చేసాడు. రోహిత్ శర్మ 212 బంతులు ఎదుర్కొని 120 పరుగులను కొల్లగొట్టాడు. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 170 బంతుల్లో 114 పరుగులతో తన జట్టుకు బలమైన స్కోర్ ను అందించాడు. వీళ్లందరిలో ఒక్క రోహిత్ శర్మ మినహా, అందరూ కూడా ఆఖరి మ్యాచులోనే తమ సెంచురీలను నమోదుచేసుకున్నారు.

క్యాచ్‌ల విషయానికొస్తే, నాలుగు మ్యాచుల్లో కలిపి విరాట్ కోహ్లీ 5 క్యాచ్ లు  పట్టగా, శ్రేయాస్ అయ్యర్ ఐదు ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్ లు అందుకున్నాడు. ఆసీస్ ఆపత్కాల కెప్టెన్ స్టీవ్ స్మిత్ 6 ఇన్నింగ్స్ లో మూడు క్యాచులతో మూడో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపింగ్ విషయంలో టీమిండియా లేటెస్ట్ సెన్సేషన్, కె.ఎస్.భరత్ 8 ఇన్నింగ్స్ లో 7 క్యాచ్ లు, ఒక స్టంపింగ్ తో అలరించగా, విజిటింగ్ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 6 ఇన్నింగ్స్ లో 4 క్యాచ్ లు, రెండు స్టంపింగ్స్ చేసాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు ఒకటి తేడాతో భారత్ వశమైన సంగతి తెలిసిందే.