Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని టీ20 జట్టు నుంచి తప్పించే ఆలోచనలో ఉంది BCCI. టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లిని ఎంపిక చేయొద్దని డిసైడ్ అయినట్టు సమాచారం. వెస్టిండీస్, USAల్లో ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు తప్ప మిగిలినవన్నీ వెస్టిండీస్‌లోనే జరుగుతాయి. ఇక్కడి పిచ్‌లు చాలా స్లోగా ఉంటాయి. అక్కడి పరిస్థితుల్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడే కోహ్లి జట్టుకు భారమని BCCI ఆలోచిస్తోంది.
Manchu Manoj: మంచు మనోజ్‌కు కవల పిల్లలు.. క్లారిటీ ఇచ్చిన మనోజ్
2013 నుంచి ఐసీసీ ట్రోఫీలేవీ ఇండియాకు రావట్లేదని BCCIపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందుకే మూడు నెలల్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ ముందు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని BCCI డిసైడ్ అయింది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లిని తప్పించడమంటే అంత ఈజీ కాదు. అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. క్రికెట్ వర్గాల్లో సంచలనం రేగుతుంది. అందుకే ఎంతో సెన్సిటివ్ అయిన ఈ బాధ్యతలను టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లికి ఎలాగొలా నచ్చజెప్పడానికి అగార్కర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లుగా తన స్టైల్ మార్చుకోమని కోహ్లికి అగార్కర్ ముందే చెప్పాడని అంటున్నారు. ఆఫ్గనిస్థాన్ సిరీస్‌లో దూకుడుగా ఆడటానికి ప్రయత్నించిన కోహ్లి అంతగా రాణించలేదు. రెండు మ్యాచ్‌ల్లో 29 పరుగులే చేశాడు. ఇందులో ఓ డకౌట్ కూడా ఉంది. యంగ్ క్రికెటర్స్ మాత్రం టీ20లో ఇరగదీస్తున్నారు. అందుకే విరాట్‌ని తప్పిస్తే ఓ యువ క్రికెటర్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని BCCI పెద్దలు ఆలోచిస్తున్నారు. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, శివమ్ దూబె అఫ్గానిస్థాన్ తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా ఆడారు.
హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ కూడా గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తున్నారు. ఫామ్‌లో ఉన్న క్రికెటర్ల సంఖ్య పెరిగిపోవడంతో.. టీ20కి జట్టును ప్రకటించడం సెలక్టర్లకు పెద్ద భారంగా మారింది. ICCకి మే నెల మొదటి వారంలోనే వరల్డ్ కప్ ప్రొవిజినల్ స్క్వాడ్ లిస్ట్ పంపించాల్సి ఉంటుంది. ఈ లోపు IPL చాలా వరకూ అయిపోతోంది. ఇందులో సత్తా చాటిన వారికి వరల్డ్ కప్ లో ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి కోహ్లీకి రెస్ట్ ఇచ్చే ఆలోచనలో BCCI ఉంది. అందుకు కోహ్లీ ఏమంటాడో.. ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.