VIRAT KOHLI: రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ

సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడనున్నారు. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఆడేందుకు వీరిద్దరూ ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ఆఫ్గనిస్తాన్‌తో జరిగే సీరీస్‌కి ఎంపిక చేశారు.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 03:01 PM IST

VIRAT KOHLI: భారత్ క్రికెట్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్. ఊహించిందే జరిగింది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడనున్నారు. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఆడేందుకు వీరిద్దరూ ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ఆఫ్గనిస్తాన్‌తో జరిగే సీరీస్‌కి ఎంపిక చేశారు. కోహ్లీ, రోహిత్ చివరగా 2022 టీ ట్వంటీ ప్రపంచకప్‍లో ఆడారు. కాగా ఆఫ్గన్‌తో సిరీస్‍కు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు.

SURYA KUMAR YADAV: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. కొన్ని మ్యాచ్‌లకు సూర్య దూరం..?

ఈ ఏడాది జూన్‍‍లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఆడనున్న ఆఖరి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఇదే కానుండటంతో ఈ సిరీస్ కీలకంగా మారింది. టీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత రోహిత్‌, కోహ్లీలు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో వీరిద్దరి టీ20 కెరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు. తాజాగా వచ్చే వరల్డ్ కప్ ఆడాలని వీరిద్దరూ భావించడంతో వారిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సెలెక్టర్లు సంకేతాలు ఇచ్చేశారు. ఈ సీరీస్ కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో వన్డే, టెస్టు సిరీస్ ఆడిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు విశ్రాంతిని ఇచ్చారు. దీంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే బుమ్రా, సిరాజ్‌కు కూడా విశ్రాంతినివ్వగా.. గాయాలతో హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ షమి జట్టుకు దూరమయ్యారు.

అయితే లెగ్ స్పిన్నర్ చాహల్‌కు నిరాశే మిగిలింది. చాహల్‌కు బదులుగా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కే సెలక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబె ఛాన్స్ దక్కించుకున్నాడు. జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది. మొహాలి, ఇండోర్, బెంగళూరు వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి.