Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా మనసంతా నువ్వే.. నీపై నా ప్రేమ అనంతం’’ అని భార్యపై తన భావాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడీ రన్ మెషీన్. రికార్డుల రారాజు విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు.
TOLLYWOOD: టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్ చేస్తారా.. డ్రగ్స్ కేసు బయటకు వస్తుందా..?
నాడు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా.. అనుష్క నుదిటిన సింధూరం దిద్ది భార్యగా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు కోహ్లి. ఇక పెళ్లినాటికే విరాట్ టీమిండియా కెప్టెన్‌గా.. అనుష్క కూడా బీ టౌన్‌లో హీరోయిన్‌గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను సీక్రెట్‌గా ప్లాన్ చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీతోపాటు వివిధ రంగాల ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
మరోవైపు.. అనుష్క సైతం తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా విరుష్క జంటకు కుమార్తె వామిక సంతానం. ఈ ఇద్దరి పెళ్లి రోజును ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.