Virat Kohli: సచిన్ రికార్డులను మింగేస్తున్న డైనోసార్ కోహ్లీ..!

పనిలో పనిగా తాను ఆరాధించే సచిన్‌ తెందూల్కర్‌ ఘనతకు ఎసరు పెట్టాడు! భారత్‌ తరఫున 300 విజయాల్లో పాలుపంచుకున్న జాబితాలో మొన్నటి వరకు సచిన్‌ తెందూల్కర్‌ మాత్రమే ఉన్నాడు. తాజాగా విరాట్‌ కోహ్లీ ఆ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 06:02 PM IST

Virat Kohli: పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీకి రికార్డులు సృష్టించడం.. వాటిని బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు! ఆడిన ప్రతి సిరీసులో ఏదో ఒక ప్రత్యేకత చాటుకుంటాడు. దిగ్గజాల ఘనతను చెరిపివేయడమో.. తన పేరుతో లిఖించుకోవడమో చేస్తుంటాడు. ఆసియాకప్‌లోనూ అంతే! టీమ్‌ఇండియా సాధించిన 300 విజయాల్లో భాగమైన ఘనత అందుకున్నాడు. పనిలో పనిగా తాను ఆరాధించే సచిన్‌ తెందూల్కర్‌ ఘనతకు ఎసరు పెట్టాడు! భారత్‌ తరఫున 300 విజయాల్లో పాలుపంచుకున్న జాబితాలో మొన్నటి వరకు సచిన్‌ తెందూల్కర్‌ మాత్రమే ఉన్నాడు.

తాజాగా విరాట్‌ కోహ్లీ ఆ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. 300 విజయాల్లో భాగమైన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై టీమ్‌ఇండియా సాధించిన విజయంతో అతడి ఖాతాలో ఈ ఘనత చేరిపోయింది. ఇక సచిన్‌ 307 విజయాల రికార్డుకు అతడు అత్యంత చేరువలో ఉన్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దానిని తిరగరాయడం ఖాయమే అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 300 విజయాల రికార్డు కేవలం ఆరుగురికే ఉంది. 337 విజయాలతో రికీ పాంటింగ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

మహేళ జయవర్దనె 336 మ్యాచులు, సచిన్ తెందూల్కర్‌ 307 మ్యాచులు, జాక్వెస్‌ కలిస్‌ 305 మ్యాచులు, కుమార సంగక్కర 305 మ్యాచుల తరవాత.. ఇప్పుడు విరాట్ 300 విక్టరీల్లో భాగమయ్యాడు. టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ 298 విజయాలతో ఆగిపోయాడు.