VIRAT KOHLI: అది నో బాల్.. కాదు కరెక్ట్ బాల్.. వివాదాస్పదంగా కోహ్లీ ఔట్

ఏడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కోహ్లీ రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 18 పరుగులు చేశాడు. టాప్ గేర్‌లో కొనసాగుతున్న సమయంలో వివాదాస్పద డెలివరీకి బలయ్యాడు. హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కాట్ అండ్ బౌల్ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 03:23 PM IST

VIRAT KOHLI: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. 223 పరుగుల టార్గెట్‌ను ఛేదింటే క్రమంలో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 8 మ్యాచ్‌లలో ఆ జట్టుకు ఇది ఏడో ఓటమి. కోల్‌కతాతో మ్యాచ్ పరాజయం తర్వాత ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమికి కోహ్లీ వివాదాస్పద ఔట్ కారణమన్న వాదన మొదలైంది.

PAWAN KALYAN ON KRISHNA: సూపర్ స్టార్ కృష్ణను పవన్ అవమానించాడా..? వాదనలో నిజమెంత..?

ఏడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కోహ్లీ రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 18 పరుగులు చేశాడు. టాప్ గేర్‌లో కొనసాగుతున్న సమయంలో వివాదాస్పద డెలివరీకి బలయ్యాడు. హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కాట్ అండ్ బౌల్ అయ్యాడు. నడుం కంటే ఎత్తులో దూసుకొచ్చిన ఫుల్ టాస్ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేకపోయిన విరాట్‌ బ్యాట్‌ను అడ్డు పెట్టాడు. బ్యాట్‌పై అంచుకు తగిలిన ఆ బంతిని హర్షిత్ రాణా అలవోకగా అందుకున్నాడు. అయితే నడుం కంటే ఎత్తులో బౌలర్ సంధించిన డెలివరీని నో బాల్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ బంతికి అంపైర్ అవుట్ ఇవ్వడంతో కోహ్లీ రివ్యూ సైతం తీసుకున్నా అది సక్సెస్ కాలేదు. అందులోనూ అవుట్‌గా తేలింది. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లాడు. కాగా ఈ ఔట్‌‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రీజు నుంచి కోహ్లీ బయట ఉండటం వల్లే అవుట్ ఇవ్వాల్సి వచ్చిందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

దీనిపై మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. వసీం జాఫర్, అంబటి రాయుడు వంటి క్రికెటర్లు కోహ్లీది నాటౌట్ అంటున్నారు. కోహ్లీ అవుట్ అయిన బంతిని తాను అబ్జర్వ్ చేశానని జాఫర్ చెప్పాడు. బాల్‌ నడుం కంటే ఎత్తులో వెళ్లిందని, నో బాల్‌కు కోహ్లీ అవుట్ అయ్యాడని వ్యాఖ్యానించాడు. అటు అంబటి రాయుడు కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అత్యంత చెత్త నిర్ణయంగా అభివర్ణించాడు. ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకునే ముందు కళ్లు మూసుకుంటారా అని ప్రశ్నించాడు. ఇక నవజ్యోత్‌సింగ్ సిద్ధు సైతం దీనిని నోబాల్‌గానే అభిప్రాయపడ్డాడు. అటు అభిమానులు కూడా ఈ వివాదాస్పద ఔట్‌పై మండిపడుతున్నారు.