మొదటి బంతినుంచే విరుచుకుపడే తత్వం వీరి సొంతం. తమ సొంత స్ట్రాటజీతో ప్రత్యర్థిపై పరుగుల దండయాత్రను ఏకధాటిగా కొనసాగించేవారు. ఈ ఇద్దరి ఓ డి ఐ ట్రాక్ రికార్డును గనక పోల్చి చూస్తే, ఆసీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ హేడెన్, తాను క్రికెట్ లో కొనసాగినన్ని రోజులు ఆసీస్ తరపున 161 వన్ డే మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహిస్తే, డేరింగ్ అండ్ డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్ 251 వన్ డేల్లో టీమిండియా తరపున స్ట్రైక్ రొటేట్ చేసాడు. బలమైన షాట్లను బాదే హేడెన్, 6133 పరుగులు రాబడితే, సెహ్వాగ్ 8273 పరుగులను పిండుకున్నాడు.
సునామి ఇన్నింగ్స్ కి పెట్టింది పేరైన ఈ చిచ్చరపిడుగులు తమ ఓ డి ఐ గ్రాఫ్ లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ను ఎన్నింటినో ఆడి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. హేడెన్ వైట్ బాల్ క్రికెట్ లో పది సెంచురీలు, 36 అర్థ సెంచురీలు సాధిస్తే, వీరు పదిహేను సెంచురీలు, 38 అర్థ సెంచురీలు సాధించాడు. వన్ డే క్రికెట్ లో హేడెన్ అత్యుత్తమ స్కోర్ 181 పరుగులు. వీరేంద్ర సెహ్వాగ్ అత్యుత్తమ స్కోర్ ఏకంగా 219 పరుగులు. సగటు విషయానికొస్తే, ఆసీస్ ఓపెనర్ 43 . 81 తో తన వన్ డే క్రికెట్ కు వీడ్కోలు పలకగా, టీమిండియా లెజెండ్ సెహ్వాగ్ 35 సగటుతో బ్లూ జెర్సీకి వీడ్కోలు చెప్పాడు. ఈ ఇద్దరిలో మీ ఫేవరైట్ బ్యాట్స్ మెన్ ఎవరో కామెంట్స్ రూపంలో చెప్పండి. మరియు, ఒక జెనెరేషన్ కి సంబంధించిన ఇంకే ఇతర ఆటగాళ్ల కంపారిజన్ మీరు చూడదల్చుకున్నారో తెలియజేయండి.