India vs Pak: ఆసియాకప్ 2023లో భాగంగా దాయాది దేశాలు సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా చివరిసారి తలపడ్డ భారత్, పాకిస్థాన్ జట్లు.. ఇన్నాళ్లకు మళ్లీ పోటీపడనున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ఆ బజ్ మొదలైంది.
తాజాగా భారత్-పాక్ సమరాన్ని ఉద్దేశించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలను అభిమానులతో మీడియా ద్వారా పంచుకున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ హద్దులు దాటుతోందని, ఆ మాటలను టీవీల్లో చెప్పలేమని సెహ్వాగ్ తెలిపాడు. “భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌ను ఇరు దేశాల మధ్య యుద్దంలానే భావిస్తారు” అని ఈ డేరింగ్ అండ్ డాషింగ్ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. భారత్-పాక్ మ్యాచ్ కోసం యావద్భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.