Virender Sehwag : ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్..

టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. ఇప్పుడు ICC నుంచి అత్యున్నత గౌరవం అందుకున్నాడు.

టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. ఇప్పుడు ICC నుంచి అత్యున్నత గౌరవం అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు చోటు దక్కింది. సెహ్వాగ్‌తో పాటు భారత మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి కూడా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. వీరి ముగ్గురినీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్ నుంచి 9 మంది క్రికెటర్లకు ఇప్పటి వరకూ స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. టెస్టుల్లో 23 సెంచరీలు చేసిన సెహ్వాగ్.. ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ట్రిపుల్ సెంచరీ కూడా సెహ్వాగ్ పేరు మీద ఉంది. వన్డేలలో 15 సెంచరీలు చేసిన వీరూ.. ఓ డబుల్ సెంచరీ కూడా బాదేశాడు. ఆఫ్ స్పిన్నర్‌గానూ సెహ్వాగ్.. టెస్టుల్లో 40, వన్డేలలో 96 వికెట్లు పడగొట్టాడు.