Sam Curran: తుది జట్టులో ఉండే అర్హత కూడా లేదు.. పంజాబ్ కెప్టెన్‌పై సెహ్వాగ్ ఫైర్

ఐపీఎల్‌ 17వ సీజన్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ సామ్‌ కరన్‌ను 18.5 కోట్ల భారీ మొత్తానికి రిటైన్‌ చేసుకుంది. గతేడాది నామమాత్రపు ప్రదర్శనే చేసినా అతడి టాలెంట్‌పై నమ్మకంతో జట్టులో కొనసాగించింది. అయితే.. అతడికి అసలు తుదిజట్టులో ఉండే అర్హతే లేదంటూ మండిపడ్డాడు.

  • Written By:
  • Updated On - April 22, 2024 / 07:25 PM IST

Sam Curran: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు. అతడికి అసలు తుదిజట్టులో ఉండే అర్హతే లేదంటూ మండిపడ్డాడు. బౌలర్‌గా లేదంటే బ్యాటర్‌గా.. ఏ విభాగంలోనూ రాణించడం లేదంటూ విమర్శించాడు. అలాంటి ఆటగాడితో జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Delhi CM Kejriwal: కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వాలి.. ఆయన్ని జైల్లో చంపేస్తారేమో: ఆప్

కొంచెం బ్యాటింగ్‌.. కొంచెం బౌలింగ్‌ పనికిరాదన్నాడు. బ్యాటింగ్‌తోనైనా.. బౌలింగ్‌తోనైనా మ్యాచ్‌ను గెలిపిస్తేనే ఆటకు విలువ ఉంటుందన్నాడు. రెండూ లేనపుడు అలాంటి ఆటగాడితో జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ సామ్‌ కరన్‌ను 18.5 కోట్ల భారీ మొత్తానికి రిటైన్‌ చేసుకుంది. గతేడాది నామమాత్రపు ప్రదర్శనే చేసినా అతడి టాలెంట్‌పై నమ్మకంతో జట్టులో కొనసాగించింది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్నప్పటికీ ఈ ఇంగ్లండ్‌ ప్లేయర్ తాజా ఎడిషన్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఆడుతున్నా మ్యాచ్‌ విన్నర్‌ కాలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో సామ్‌ కరన్‌ ఇప్పటి వరకు 11 వికెట్లు తీయడంతో పాటు.. 152 పరుగులు చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ ఆకట్టుకోలేకపోయాడు.

ఇక గాయం కారణంగా శిఖర్‌ ధావన్‌ గత రెండు మ్యాచ్‌లకు దూరమవడంతో సామ్ కరన్‌ అతడి స్థానంలో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలోనూ పంజాబ్‌ ఓడిపోయింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో రెండు గెలిచి ఆరింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.