Vizag Stadium : ఢిల్లీ హోమ్ గ్రౌండ్ గా విశాఖ…

ఐపీఎల్ 17వ సీజన్‌లో విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్టేడియం రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. వైజాగ్ బేస్డ్ ఫ్రాంచైజీ లేకపోయినా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి రెండు హోమ్ మ్యాచ్‌లను సాగర తీరాన ఆడాలని నిర్ణయించుకుంది. ఫస్టాఫ్ షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది.

ఐపీఎల్ 17వ (IPL17) సీజన్‌లో విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్టేడియం (YS Rajasekhara Reddy Stadium)రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. వైజాగ్ బేస్డ్ ఫ్రాంచైజీ లేకపోయినా.. ఢిల్లీ క్యాపిటల్స్  (DELHI CAPITALS) తమ తొలి రెండు హోమ్ మ్యాచ్‌లను సాగర తీరాన ఆడాలని నిర్ణయించుకుంది. ఫస్టాఫ్ షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులోని తమ హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం (Arun Jaitley Ground) కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖను ఎంచుకుంది. అయితే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లు ఢిల్లీ వేదికగా జరగనున్నాయి.

ఐపీఎల్ (IPL) ప్రారంభానికి ముందు అరుణ్ జైట్లీ మైదానం వేదికగా 11 డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్‌లో జీవం పోయే అవకాశం ఉండటంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ హోమ్ మ్యాచ్‌లను విశాఖకు తరలించింది.

మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ క్యాంపెయిన్ ను షురూ చేయనుంది. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో ముందుగా 21 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే బీసీసీఐ వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా 52 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.