Viv Richards: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ ఫీవర్ నడుస్తోంది. మెగా ఈవెంట్‌కు ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే డిబేట్లు మొదలయ్యాయి. ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేదెవరు..? టాప్ వికెట్ టేకర్ అయ్యేదెవరు..? తదితర అంశాల గురించి క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేదెవరో అంచనా వేశాడు.
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి ఆ అర్హత ఉందని రిచర్డ్స్ పేర్కొన్నాడు. ‘‘పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన సమయంలో షాహిన్ ఆఫ్రిది ఎదుగుదలను దగ్గరగా చూశాను. ఆట పట్ల అంకితభావం కలవాడు. వరల్డ్‌కప్‌లో షాహిన్ ఆఫ్రిది లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడు. అతడినే నేను ఎంపిక చేసుకుంటా’’ అని వివియర్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. కాగా మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ప్రధాన పేసర్‌గా మారాడు 23 ఏళ్ల షాహిన్ ఆఫ్రిది. అయితే, ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో, కొందరు నెటిజన్లు మాత్రం, బుమ్రా లేదా సిరాజ్ మాత్రమే వికెట్ టేకింగ్ టాపర్‌గా నిలుస్తారని టీమిండియా పేసర్లకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.