Kohli, Rohit Sharma : విరాట్ ను చూసి నేర్చుకోండి… కోహ్లీ పై హిట్ మ్యాన్ ప్రశంసలు

రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య కోల్డ్ వార్ (Cold War) ఉందంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. రెండు గ్రూపులుగా జట్టును మేనేజ్ చేస్తున్నారన్న కథనాలు కూడా షికారు చేశాయి. అయితే కొన్ని రోజులుగా వీటికి ఫుల్ స్టాప్ పడుతూ వస్తోంది.

రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య కోల్డ్ వార్ (Cold War) ఉందంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. రెండు గ్రూపులుగా జట్టును మేనేజ్ చేస్తున్నారన్న కథనాలు కూడా షికారు చేశాయి. అయితే కొన్ని రోజులుగా వీటికి ఫుల్ స్టాప్ పడుతూ వస్తోంది. తాజాగా కోహ్లీ పై టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. విరాట్‌ తో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ప్రతి ఒక్కరు కోహ్లి బ్యాటింగ్‌ నైపుణ్యాల గురించి మాత్రమే మాట్లాడతారని.. అయితే, అందుకోసం మైదానం బయట అతడు చేస్తున్న కృషి మరింత గొప్పగా ఉంటుందన్నాడు. దేశం కోసం ఆడేందుకు కోహ్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని రోహిత్ వ్యాఖ్యానించాడు. కేవలం వ్యక్తిగత, కుటుంబ కారణాల దృష్ట్యా మాత్రమే అతడు ఆటకు దూరంగా ఉంటాడే తప్ప.. ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరమైన దాఖలాలే లేవని రోహిత్‌ కొనియాడాడు.

గాయాల కారణంగా కోహ్లి ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్‌ అకాడమీకి (National Cricketer  Academy) వెళ్లలేదని.. అదీ అతడి ఫిట్‌నెస్‌ లెవల్స్‌కు నిదర్శమని ప్రశంసించాడు. యువ ఆటగాళ్లంతా కోహ్లిని ఈ విషయంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలని రోహిత్‌ సూచించాడు. జియో సినిమా షోలో భాగంగా టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిట్ మ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ప్రశంసలతో క్రికెట్ ఫాన్స్ సంబర పడుతున్నారు. అతను చేసిన తాజా కామెంట్స్ తో వారిద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవని తేలిపోయిందంటూ చెబుతున్నారు. కాగా కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.