Sunil Narines : సునీల్ నరైన్ రిటైర్మెంట్ ఐపిఎల్ లో మాత్రం..

వెస్టిండీస్ (West Indies) మిస్టరీ సునీల్ నరైన్ (Sunil Narines) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల నుంచీ వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా వివిధ దేశాల తరఫున టీ20 లీగ్ ఫ్రాంఛైజీల్లో కొనసాగుతానని తెలిపాడు. దేశవాళీ వన్డేలకూ గుడ్‌బై చెప్పాడు సునీల్ నరైన్.

వెస్టిండీస్ (West Indies) మిస్టరీ సునీల్ నరైన్ (Sunil Narines) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల నుంచీ వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా వివిధ దేశాల తరఫున టీ20 లీగ్ ఫ్రాంఛైజీల్లో కొనసాగుతానని తెలిపాడు. దేశవాళీ వన్డేలకూ గుడ్‌బై చెప్పాడు సునీల్ నరైన్. ప్రస్తుతం అతను ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. వెస్టిండీస్‌లో సూపర్ 50 కప్‌ టోర్నమెంట్ ఆడుతున్నాడు. దీని తరువాత డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు చెప్పాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశాడు. 35 సంవత్సరాల సునీల్ నరైన్.. మిస్టరీ స్నిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెస్టిండీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2012లో టీ20 (T20) ప్రపంచకప్‌ ( World Cup) ను గెలిచిన వెస్టిండీస్ జట్టులో అతను సభ్యుడు కూడా. ఇప్పటివరకు 65 వన్డేలు, 51 టీ20 ఇంటర్నేషనల్స్, ఆరు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు. ఐపీఎల్‌ సహా వివిధ దేశాల తరఫున టీ20 ఫ్రాంఛైజీల్లో మాత్రం కొనసాగుతానని, ఇకపై వాటిపై దృష్టి పెడతానని సునీల్ నరైన్ వివరించాడు. కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆడుతున్న సునీల్, మంచి ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు.