Nicholas Pooran: అంపైర్ తరపున ఐసిసి పూరన్ చేష్టలకు ఫైన్

వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఐసీసీ లెవెల్-1 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఫైన్‌ విధించింది.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 04:13 PM IST

వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఐసీసీ లెవెల్-1 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఫైన్‌ విధించింది. ఆదివారం గయానా వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. ఒక డీమెరిట్ పాయింట్‌ కూడా అతని ఖాతాలో చేరింది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్‌లోని నాలుగో బంతిని కైల్‌ మేయర్స్‌ లెగ్‌ సైడ్‌ షాట్ ఆడాడు. అయితే బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే భారత ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్ ఇచ్చేశాడు.

కైల్‌ మేయర్స్‌ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న నికోలస్‌ పూరన్‌తో చర్చించి.. రివ్యూ కోరాడు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్..​ అంపైర్‌ కాల్‌ ఇచ్చాడు. దీంతో మేయర్స్‌ పెవిలియన్ చేరాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై నికోలస్‌ పూరన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నువ్ ఔట్‌ ఇవ్వకపోయి ఉంటే.. కైల్‌ మేయర్స్‌ కచ్చితంగా నాటౌటే’ అంటూ బహిరంగంగా అన్నాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్‌ అంపైర్‌లు, మ్యాచ్ రిఫరీకు ఫిర్యాదు చేశారు. దాంతో రిఫరీ పూరన్‌పై చర్యలు తీసుకున్నాడు. పూరన్‌ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది. రెండేళ్ల వ్యవధిలో పూరన్‌కు ఇదే మొదటి జరిమానా. లెవెల్ 1 కిందకు వచ్చే నేరాలకు గరిష్టంగా 50 శాతం ఆటగాడి మ్యాచ్ ఫీజులో కోత మరియు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు.