రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తొలి మ్యాచ్‌లో సక్సెస్ కాలేకపోయాడు. జట్టు యాజమాన్యం నుంచి మద్దతు ఉన్నప్పటికీ అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడిలో హార్దిక్ తడబడ్డాడు. బౌలింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమి గురించి హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ తీవ్రంగా చర్చించుకున్నారు. ఇదంతా కెమెరా కంటికి చిక్కింది. రోహిత్ సీరియస్‌గా వివరిస్తుండటంతో వాగ్వాదంలా అనిపించింది. ఇవాళ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హార్దిక్‌కు రోహిత్ సీరియస్‌గా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మపై హార్దిక్ పాండ్యా గట్టిగా అరిచాడు. అతని అరుపులకు నిర్ఘాంతపోయిన రోహిత్ శర్మ.. చేసేదేం లేక కెప్టెన్ సూచించిన ఫీల్డ్ పొజిషన్‌లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఫీల్డింగ్ విషయంలో తన సూచనలను పట్టించుకోని ఆటగాళ్లను రోహిత్ శర్మ గట్టిగా మందలించిన వీడియోలు చాలా వరకు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు అతను కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవడం చూసి ఫ్యాన్స్ అయ్యో పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా
పవర్‌ప్లేలో బుమ్రాను ఆలస్యంగా తీసుకురావడం, ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.