IPL 2024 : ఐపీఎల్ మధ్యలోనే అమెరికాకు.. కారణం ఏంటంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 17వా సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ చేర్ జట్ల పై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ప్రస్తుతానికి 8 జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ (World Cup) కోసం భారత క్రికెటర్లు ఐపీఎల్ (IPL 2024) మధ్యలోనే అమెరికాకు వెళ్ళిపోనున్నారు.

దాదాపుగా సగం భారత జట్టు ముందే వరల్డ్ కప్కు పయనమవడం వెనుక ఓ కారణం ఉంది. టీ20 (T20) ప్రపంచ కప్ జూన్ 1వ తేదీన స్టార్ట్ అవుతంది. మెగా టోర్నీకి ముందు అన్ని టీమ్స్ రెండు వార్మప్ మ్యాచులు ఆడతాయి. అందుకే ఐపీఎల్ ప్లేఆఫ్స్ టీమ్ లోనే ఫస్ట్ బ్యాచ్ భారత ఆటగాళ్లు యూఎస్ వెళ్లనున్నారు.

ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కాని జట్లలోని టీమిండియా ప్లేయర్లు ముందే అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు. నాకౌట్స్‌లో ఆడే క్రికెటర్లు మే 27 లేదా 28వ తేదీన అమెరికాకు బయలుదేరే అవకాశం ఉంది. ప్లేఆఫ్స్ కు ముందే వెళ్లే బృందంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, సిరాజ్, హార్దిక్, స్కై ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ లో వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు ప్లేఆఫ్స్ రేసుకు దూరమయ్యాయి.. అందుకే ఐపీఎల్ మధ్యలోనే విరాట్, రోహిత్ సహా దాదాపుగా సగం టీమిండియా ప్లేయర్లు యూఎస్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఐపీఎల్ ప్లేఆఫ్స్ మే 21న మొదలవనున్నాయి.