ఐపీఎల్ కెప్టెన్ల శాలరీ ఎంతంటే ? జాబితాలో టాప్ ప్లేస్ అతడిదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసులు కురిపించే లీగ్... కేవలం బీసీసీఐకి మాత్రమే కాదు ఫ్రాంచైజీలు, స్పాన్సర్లూ , ఆటగాళ్ళు కూడా భారీగానే ఆర్జిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 05:34 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసులు కురిపించే లీగ్… కేవలం బీసీసీఐకి మాత్రమే కాదు ఫ్రాంచైజీలు, స్పాన్సర్లూ , ఆటగాళ్ళు కూడా భారీగానే ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 17 సీజన్లు పూర్తి చేసుకోగా… త్వరలో 19వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 10 జట్ల కెప్టెన్లలో అత్యధిక జీతం అందుకుంటున్న ఆటగాళ్ళ జాబితాపై చర్చ జరుగుతోంది. ఈ లిస్ట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. గత వేలంలో సన్ రైజర్స్ కమ్మిన్స్ కోసం 20.5 కోట్లు వెచ్చించి సారథ్య బాధ్యతలు అప్పగించింది. లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ 17 కోట్లతో రెండో స్థానంలో ఉండగా…ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 16 కోట్ల రూపాయలతో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.

ఇక రోహిత్ శర్మ స్థానంలో ఈ ఏడాది ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న హార్థిక్ పాండ్యా 15 కోట్లతో నాలుగో ప్లేస్ లో నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 14 కోట్లతో ఐదో స్థానంలోనూ, కోల్ కతాను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ 12.25 కోట్లతో ఆరో స్థానంలోనూ నిలిచారు. అటు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ 12 కోట్లతో ఏడో స్థానంలో ఉండగా…పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 8.25 కోట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాండ్యా తర్వాత గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న శుభ్ మన్ గిల్ 8 కోట్లతో తొమ్మిదో ప్లేస్ లో ఉండగా…రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ డుప్లెసిస్ 7 కోట్లతో 10వ ప్లేస్ లో నిలిచాడు.