IPL Season 2024 : కొత్తగా సన్‌రైజర్స్ హైదరాబాద్..?

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్ధం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది.

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్ధం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది. మరో రెండు రోజుల్లో ట్రేడింగ్ విండో గడువు ముగియనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు అన్ని కసరత్తులు చేస్తున్నాయి. పలు ఫ్రాంచైజీలకు సంబంధించిన రిలీజ్ ఆటగాళ్ల జాబితాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జాబితాల ప్రకారం తెలుగు టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైందట. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ. 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌.. రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లను రిలీజ్ చేసేందుకు సన్‌రైజర్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది. టీ నటరాజన్‌, ఆదిల్ రషీద్, అకీల్ హొస్సెన్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, సమర్థ్ వ్యాస్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దగార్‌లు కూడా రిలీజ్ జాబితాలో ఉన్నారట. ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 కోసం టీమ్‌ను పూర్తిగా మార్చే యోచనలో సన్‌రైజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త కోచ్ కోసం చూస్తున్న సన్‌రైజర్స్.. టీమిండియా హెడ్ కోచ్‌గా పదవి కాలం పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారిక రిలీజ్ జాబితా నేడు వచ్చే అవకాశాలు ఉన్నాయి.