Hardik Pandya : సారథిగా హార్థిక్ ను వద్దన్నది ఎవరు ? దెబ్బేసిన ఐపీఎల్ కెప్టెన్సీ

టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అనూహ్యమనే చెప్పాలి.

 

 

టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అనూహ్యమనే చెప్పాలి. వరల్డ్ కప్ తో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వైస్ కెప్టెన్ గా ఉన్న హార్థిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. అయితే కొత్త కోచ్ గంభీర్ దీనికి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఇది నిజమేనని అనుకున్నా మరో వ్యక్తి కూడా హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వొద్దని బీసీసీఐకి చెప్పినట్టు తెలుస్తోంది.ఆ వ్యక్తి ఎవరో కాదు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్… బీసీసీఐ పెద్దలతో భేటీ సందర్భంగా అగార్కర్, గంభీర్ కెప్టెన్సీ మార్పుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ఫిట్ నెస్ సమస్యలు, 2026 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని గంభీర్ హార్థిక్ ను నిరాకరిస్తే… అగార్కర్ మాత్రం మరికొన్ని కారణాలను చెప్పాడట. ముఖ్యంగా పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్ తో తాను ఏమాత్రం సంతృప్తిగా లేనని అగార్కర్ బోర్డుకు చెప్పాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ను హార్థిక్ సమర్థవంతంగా లీడ్ చేయలేకపోయాడు. పేలవ కెప్టెన్సీతోనే ముంబై పరాజయాలకు కారణమయ్యాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే జట్టులో సహచరులకు సూర్యకుమార్ తరహాలో స్వేచ్ఛ ఇవ్వకపోవడం కూడా అతనికి మైనస్ గా మారింది. అగార్కర్ చెప్పిన అభిప్రాయాలతో మిగిలిన సెలక్టర్లు కూడా ఏకీభవించడంతో సూర్యకుమార్ కు కెప్టెన్సీ దక్కింది.