LAST 3 TESTS : ఎవరు ఇన్ ? ఎవరు ఔట్ ? చివరి 3టెస్టుల్లో ఆడే జట్టు ప్రకటన

ఇంగ్లండ్ (England) తో ఆడే చివరి మూడు క్రికెట్ టెస్టులకు ఇవాళ భారత జట్టుని ప్రకటించే అవకాశం ఉంది. టీమ్ లోకి ఎవరు ఇన్..ఎవర్ ఔట్ అనేది ఆసక్తిరేపుతోంది. ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతిని ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు జట్టులో చేరతాడనేది డౌటే.

 

ఇంగ్లండ్ (England) తో ఆడే చివరి మూడు క్రికెట్ టెస్టులకు ఇవాళ భారత జట్టుని ప్రకటించే అవకాశం ఉంది. టీమ్ లోకి ఎవరు ఇన్..ఎవర్ ఔట్ అనేది ఆసక్తిరేపుతోంది. ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతిని ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు జట్టులో చేరతాడనేది డౌటే.

హైదరాబాద్‌ ఓటమికి వైజాగ్‌లో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా(Team India). ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఇప్పుడు మూడో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. భారత్-ఇంగ్లండ్ (India-England) మధ్య మూడో టెస్ట్ 15 నుంచి ప్రారంభమవుతుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది, ఇక్కడ గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యం సాధిస్తుంది. దీంతో మూడో మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.

ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు మ్యాచ్‌లకు భారత్ జట్టును ఇవాళ ఎంపిక చేయనుంది బీసీసీఐ. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు స్టార్‌ ప్లేయర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరం అవుతాడని తెలుస్తోంది. వర్క్‌ లోడ్‌ కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్యాలని బీసీసీఐ (BCCI) ఆలోచిస్తోంది. రెండో టెస్ట్‌లో బుమ్రా నాలుగు రోజుల పాటు 32 ఓవర్లు వేసి అలసిపోయాడని భావిస్తున్నారు సెలెక్టర్లు. తిరిగి చివరి రెండు టెస్ట్‌లకు జట్టులోకి ఆహ్వానిస్తారని టాక్. బుమ్రాకు రెస్ట్ ఇస్తే హైదరాబాదీ సిరాజ్‌ జట్టులో కీలకంగా మారనున్నాడు. వర్క్‌లోడ్‌ కారణంగానే సిరాజ్‌ను సైతం రెండో టెస్ట్‌కు దూరంగా ఉంచారు. మూడో టెస్ట్‌లో సిరాజ్‌, ముకేశ్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కేఎల్‌ రాహుల్‌ కూడా మూడో టెస్ట్‌ మ్యాచ్ కోసం జట్టులో చేరనున్నాడు.

వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు జట్టులో చేరతాడనేది అనుమానమే. మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండే విషయమై కోహ్లీతో మాట్లాడతామని ద్రవిడ్ తెలిపారు. మరి కోహ్లీకి అందుకు ఎస్ చెప్తారా..! నో చెప్తాడా..! అనే దానిపై క్లారిటీ లేదు. ఇక గాయపడిన రవీంద్ర జడేజా ఇంగ్లండ్ తో సిరీస్‌ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉంది.