కెప్టెన్ ఇంకా డిసైడ్ కాలే RCB డైరెక్టర్ క్లారిటీ

ఐపీఎల్ రిటెన్షన్ హడావుడి ముగిసిపోవడంతో ఇప్పుడు మెగా వేలం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. అదే సమయంలో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు రాబోతున్నారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

  • Written By:
  • Publish Date - November 6, 2024 / 08:14 PM IST

ఐపీఎల్ రిటెన్షన్ హడావుడి ముగిసిపోవడంతో ఇప్పుడు మెగా వేలం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. అదే సమయంలో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు రాబోతున్నారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేవలం ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. అలాగే సారథిగా విరాట్ కోహ్లీని నియమిస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కొత్త కెప్టెన్ కు సంబంధించి ఆ టీమ్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీ సారథిగా మళ్ళీ పగ్గాలు అందుకుంటాడంటూ వస్తున్న వార్తలను ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ కొట్టిపారేశాడు. వాటిలో నిజం లేదన్నాడు. మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రిలీజ్ చేసిన తర్వాత బెంగళూరు కెప్టెన్సీ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.

ఆర్సీబీ కొత్త కెప్టెన్ కు సంబంధించి చర్చిస్తున్నామని, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి ఎంపిక చేయడంపై ఇంకా నిర్ణయించలేదన్నాడు. వయసు రీత్యా డుప్లెసిస్ ను ఆర్సీబీ వదిలేసింది. దీంతో కెప్టెన్ కమ్ బ్యాటర్ కోసం వేలంలో ప్రయత్నించబోతుందన్న వార్తలు కూడా వినిపించాయి. పంత్ లేదా కెఎల్ రాహుల్ లలో ఒకరిని వేలంలో కొనుగోలు చేస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఈ వార్తలు వినిపిస్తుండగానే ఆర్సీబీ పగ్గాలు మళ్ళీ కోహ్లీ అందుకుంటున్నాడన్న న్యూస్ కూడా రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ అలాంటిదేమీ లేదంటూ టీమ్ డైరెక్టర్ కోహ్లీ ఫ్యాన్స్ జోష్ పై నీళ్ళు చల్లాడు.

కాగా ఆర్సీబీ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌. 35 ఏళ్ల విరాట్.. 143 మ్యాచ్‌లలో బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ 2016 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్‌కు చేరుకుంది. ఆ సీజన్ లో కోహ్లీ కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను పలు రికార్డులు నెలకొల్పాడు. నాలుగు సెంచరీలతో పాటు మొత్తం 973 పరుగులు చేసి ఒకే సీజన్ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీతో పాటు యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్, బౌలర్ యశ్ దయాల్‎ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటిదార్‎కు 11 కోట్లు, యశ్ దయాల్‎కు 5 కోట్లు చెల్లించింది. ఈ ముగ్గురి కోసం ఆర్సీబీ తమ పర్స్‎లోని 37 కోట్లు కేటాయించగీ… మిగిలిన రూ.83 కోట్లతో మెగా వేలానికి వెళ్లనుంది.