దులీప్ ట్రోఫీలో సీనియర్లు కోహ్లీ,రోహిత్ ఎందుకు ఆడడం లేదంటే ?

  • Written By:
  • Publish Date - August 15, 2024 / 04:06 PM IST

దేశవాళీ క్రికెట్ ఈ సారి అభిమానులకు క్రికెట్ మజాను పంచనుంది. పలువురు సీనియర్ ప్లేయర్స్ దులీప్ ట్రోఫీ ఆడుతుండడమే దీనికి కారణం… కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శుభ్ మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్స్ తో దులీప్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడుతారని ప్రచారం జరగ్గా.. వారికి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు లేని సమయంలో భారత సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని గతంలో బీసీసీఐ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే కోహ్లీ, రోహిత్ దేశవాళీ క్రికెట్ ఆడకపోవడానికి గల కారణాన్ని జై షా వెల్లడించాడు. అప్ కమింగ్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొనే కోహ్లీ, రోహిత్‌లకు మినహాయింపు ఇచ్చామని తెలిపాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లలోని టాప్‌ ప్లేయర్లు కూడా ఎవరూ దేశవాళీ క్రికెట్‌ ఆడరని జైషా గుర్తు చేశారు. సీనియర్ ప్లేయర్స్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాల్సిందేనని చెప్పారు. గాయపడి కోలుకున్న క్రికెటర్లు దేశవాళీ మ్యాచ్ లు ఆడి తమ ఫామ్‌ను అందుకోవడానికి మంచిదేనని, అయితే రెగ్యులర్‌గా ఆడే వారికి అవసరం లేదన్నారు. ప్రస్తుతం రోహిత్ , కోహ్లీ తమ కుటుంబసభ్యులతో వెకేషన్ లో ఉన్నారు. బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ మూడో వారం నుంచి జరిగే టెస్ట్ సిరీస్ కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ నుంచి భారత్ కు ఆరు నెలల పాటు బిజీ షెడ్యూల్ ఉండడంతో కోహ్లీ, రోహిత్ లకు రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.