పారిస్ ఒలింపిక్స్ మరో 2 రోజుల్లో ముగిసిపోతున్నాయి. ఇప్పటి వరకూ భారత్ ఐదు పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం సాధించగా… హాకీలోనూ, షూటింగ్ లోనూ కాంస్యాలు దక్కాయి. ఇంకా భారత్ కు ఎన్ని మెడల్స్ రావొచ్చన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే భారత్ నుంచి మరో రెండు ఈవెంట్స్ లో ముగ్గురు బరిలో ఉన్నారు. శనివారం రోజున రెజ్లింగ్ లో రితికా హూడా బరిలో దిగనుంది.
మహిళల 76 కేజీ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రితికా హూడా ఫైనల్స్‌కు చేరితే పతకం వస్తుంది. .ఒకవేళ సెమీస్ లో ఓడినా కాంస్యం కోసం పోరాడుతుంది. గోల్ఫ్ లో అదితి అశోక్ , దీక్ష వ్యక్తిగత విభాగాల్లో పోటీపడనున్నారు. ఈ ఈవెంట్లలో మెడల్స్ రాకుంటే పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పోరాటం ముగిసినట్టే.