India Vs West Indies: వాన పడితే విండీస్ కు వరం భారత్ కు శాపం

భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20కి అంతా సిద్ధమైంది. యూఎస్ఏలోని ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం వెస్టిండీస్ ఈ సిరీసులో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 03:47 PM IST

భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20కి అంతా సిద్ధమైంది. యూఎస్ఏలోని ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం వెస్టిండీస్ ఈ సిరీసులో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీసును 2-2తో సమయం చేయాలని, తద్వారా చివరి మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాలని టీమిండియా భావిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ విభాగం దారుణంగా ఫెయిలవడంతో భారత జట్టు ఓటములు చవిచూసింది. అయితే మూడో మ్యాచులో సూర్యకుమార్, తిలక్ వర్మ చెలరేగడంతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా నెగ్గితేనే సిరీస్ సజీవంగా ఉంటుంది. లేదంటే చివరి మ్యాచ్ డెడ్ రబ్బర్ అవడం ఖాయం. ఇప్పటి వరకు కరీబియన్‌లోని స్లో పిచ్‌లపై ఆడిన భారత్.. ఫ్లోరిడాలో ఎలా ఆడుతుందో చూడాలి. గతంలో ఇక్కడ భారత జట్టు ఆరు మ్యాచులు ఆడింది. వీటిలో నాలుగింట భారత్ గెలవగా.. ఒకదానిలో ఓడింది. వాతావరణం వల్ల మరో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇప్పుడు జరిగే నాలుగో టీ20కి కూడా వాతావరణం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే వారికి పెద్దగా టెన్షన్ అక్కర్లేదని, చిరుజల్లులు మాత్రమే పడొచ్చని, మ్యాచ్ రద్దయ్యేంతగా వర్షం పడదని వాతావరణ శాఖ ధీమా వ్యక్తం చేసింది.