ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక ఖారారైంది. వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగబోతోంది. జూన్ 11 నుంచి 15 వరకూ డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్. 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ , న్యూజిలాండ్ తలపడగా.. కివీస్ విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా రెండోసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియాకు ఆసీస్ ప్రత్యర్థిగా నిలిచి టైటిల్ ను దూరం చేసింది. ఈ మ్యాచ్ కు ఓవల్ ఆతిథ్యమివ్వగా… ఈ సారి లార్డ్స్ ఆతిథ్యమివ్వబోతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ లో ఉండగా.. దాదాపు ఫైనల్ బెర్త్ ఖరారైనట్టే. మరో ప్లేస్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి.